ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్, నవంబర్ : ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా చైతన్యపురి డివిజన్ ప్రభాత్‌నగర్ పార్కును ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సందర్శించి వాకర్స్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వందలాది మంది కాలనీవాసులకు వాకింగ్ కోసం ఉపయోగపడుతున్న ప్రభాత్‌నగర్ పార్కు మద్యలో టిమ్స్ దవాఖాన గేటు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను విరమించుకునేలా సంబందిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
టిమ్స్ దవాఖాన శంకుస్థాపన సమయంలో నాడు కేసీఆర్‌ను కలిసి టిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పోలీస్‌స్టేషన్, చిల్డ్రన్ పార్కు, వాటర్ ట్యాంక్, సబ్‌స్టేషన్ తదితరాల కోసం స్థలం కేటాయించాలని కోరగా వారు వెంటనే స్పందించి జీవో ఇచ్చారని, అయితే ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ జీవోలను పక్కనపెట్టిందని విమర్శించారు. టిమ్స్ హాస్పిటల్ వారు పార్కును రెండుగా చేసేలా మద్యలో గేటును ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటామని, పార్కును వాకర్స్‌కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్‌యాదవ్, మాజీ కౌన్సిలర్ త్రివేది, పవన్‌కుమార్, జయశ్రీ, గట్టు శ్రీనివాస్, రమణారెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సుధాకర్, కడియం మోహన్‌రాజ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
Nazriya Fahadh | సూర్యతో మూడు సినిమాలు మిస్.. ఇంతకీ నజ్రియా నజీమ్ ఏం చెప్పిందంటే..?
AP News | ఏపీలో గుండెపోటుతో ఎన్నికల అధికారిణి దుర్మరణం..!
‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి తిరుమలలో ‘ వైకుంఠ ఏకాదశి ’ ద్వార దర్శనాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

