‘ఆయిల్‌పాం’ విస్తరణకు అనుగుణంగా ఫ్యాక్టరీల సామర్ధ్యం పెంపు
ఆయిల్‌పాం సాగు విస్తరణకు అనుగుణంగా పామాయిల్ ఫ్యాక్టరీల సామర్థ్యం పెంచుతున్నామని ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు.
- ప్రతి ఆయిల్ పాం రైతుకు ఎఫ్-కోడ్ జారీ
- ఏటా సెప్టెంబర్ నుంచి మొక్కల పంపిణీ
- ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్
అశ్వారావుపేట, డిసెంబర్ 30: ఆయిల్‌పాం సాగు విస్తరణకు అనుగుణంగా పామాయిల్ ఫ్యాక్టరీల సామర్థ్యం పెంచుతున్నామని ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 24 వేల ఎకరాల్లో కొత్తగా ప్లాంటేషన్ పూర్తి చేశామన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేట మండలంలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను పరిశీలించి మాట్లాడారు. అశ్వారావుపేట, పెనుబల్లి, అప్పారావుపేట నర్సరీల్లో 12 లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నామన్నారు. 2025 నాటికి అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీల సామర్థ్యం గంటకు 180 టన్నులకు చేరుతుందన్నారు.
2026 నాటికి ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలో కొత్త ఫ్యాక్టరీ పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఆయిల్‌పాం రైతుకు ఎఫ్-కోడ్ అందిస్తామన్నారు. ఒకే రైతుకు వేర్వేరు ప్రాంతాల్లో ఆయిల్‌ఫాం తోటలు ఉండడం కారణంగా రవాణా ఛార్జీల చెల్లింపులో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కౌలు విధానంలోనూ మార్పులు తీసుకొస్తున్నామన్నారు. అగ్రిమెంట్స్ ప్రకారం కోడ్స్ జారీ చేస్తామన్నారు. ఒక ఎకరాకు కనీసం 14 టన్నుల గెలల అంచనాగా నిర్ణయించి ఈ మేరకు ఫ్యాక్టరీలో దిగుమతి చేసుకుంటామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు మొక్కలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట సంస్థ జనరల్ మేనేజర్ టి.సుధాకర్‌రెడ్డి, పీఅండ్‌పీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, డివిజనల్ ఆఫీసర్ బాలకృష్ణ, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

