చింతకాని, అక్టోబర్ 26 : ఖమ్మం జిల్లా చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అక్రమ అరెస్టును ఖండిస్తూ మండలవ్యాప్తంగా పార్టీ గ్రామ, మండల శాఖల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో శనివారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయ్యప్ప మాలధారణలో ఉన్న పుల్లయ్యను ఉగ్రవాదుల మాదిరిగా తీసుకెళ్లి అరెస్టు చేయడం తగదని, ప్రజాస్వామ్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వసాధారణమని, నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరునికి రాజ్యంగం కల్పించిందంటూ ఫ్లెక్సీలపై రాశారు. నిరసనలో పాల్గొన్న వ్యక్తులు, ప్రతిపక్ష నాయకుల పేర్లను చేర్చి వారిని, వారి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేయడం తగదని, అయ్యప్ప మాలధారణలో ఉన్నా కనీస హిందూ ధర్మానికి విలువ ఇవ్వకుండా అరెస్టు చేసి తీసుకెళ్లడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.