రైతులు నాకు ఫోన్ చేసే దాకా.. మీరేం చేశారు?
‘రైతులు నాకు ఫోన్ చేసే దాకా మీరేం చేశారు? అధికారుల సమన్వయంతో పనిచేసి గేట్లను ముందుగానే తెరిచి ఉంటే ప్రమాదం జరిగేది కాదు కదా? వెలుతురు తగ్గి హెలికాప్టర్లు తిరిగే వాతావరణం లేకుంటే ప్రాణనష్టం జరిగేదే కదా?’ అంటూ అధికారులకుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- అధికారుల సమన్వయలోపమే ప్రమాదానికి కారణం
- ముందే గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం జరిగేది కాదు కదా?
- హెలికాప్టర్లు తిరిగే వాతావరణం లేకుంటే ప్రాణనష్టం జరిగేదే కదా?
- ‘పెదవాగు’ సమీక్షలో అధికారులకు మంత్రి తుమ్మల మందలింపు
- ప్రమాదంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సూచన
అశ్వారావుపేట రూరల్, జూలై 21:‘రైతులు నాకు ఫోన్ చేసే దాకా మీరేం చేశారు? అధికారుల సమన్వయంతో పనిచేసి గేట్లను ముందుగానే తెరిచి ఉంటే ప్రమాదం జరిగేది కాదు కదా? వెలుతురు తగ్గి హెలికాప్టర్లు తిరిగే వాతావరణం లేకుంటే ప్రాణనష్టం జరిగేదే కదా?’ అంటూ అధికారులకుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భదాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టుకు ఇటీవల గండి పడిన ప్రమాదంపై అక్కడి గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధ్యక్షతన వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆదివారం మంత్రి తుమ్మల సమీక్షించారు.
తొలుత కలెక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అశ్వారావుపేట మండలానికి ఒక డ్రోన్, ఒక బోటు ఏర్పాటు చేస్తామని అన్నారు. రెండు హైలికాప్టర్లు, ఎన్ఆర్డీఎస్ బృందాలతో వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు, రైతులను కాపాడమని వివరించారు. కానీ ఆస్తినష్టం జరిగిందని అన్నారు. తరువాత ఐబీ ఈఈ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు సామర్థ్యం 35 వేల క్యూసెక్కులు మాత్రమేనని, కానీ ఎగువ నుంచి 80 వేల క్యూసెకుల వరద వచ్చిందని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. ‘గేట్లకు గ్రీజ్ ఎప్పడు పెట్టారు? పైకి కిందకు ట్రయల్ ఎప్పడు వేశారు?, కొత్త మోటారే కదా? ఎందుకు రిపేరు వచ్చింది?’ అని ప్రశ్నించారు.
‘18న ఉదయం ఎన్ని గంటలకు గేట్లు ఎత్తారు?’ అని తుమ్మల ప్రశ్నించగా.. ’10:30కు మొదటి గేటు, తరువాత రెండో గేటు ఎత్తాం’ అని సమాధానమిచ్చారు. 12:30 తరువాత ప్రయత్నిస్తే 3వ గేటు తెరుచుకోలేదని, వర్షాలకు తడవడం వల్ల అప్పటికే మోటారు కాలిపోయిందని తెలిపారు. ‘ఐబీ ఎస్ఈకి ఎప్పడు సమాచారం ఇచ్చారు? కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇచ్చారా? లేదా?’ అని మంత్రి ప్రశ్నించారు. ఇందుకు ఐబీ ఈఈ స్పందిస్తూ.. ‘సాయంత్రం 5 గంటలకు ఐబీ ఎస్ఈకి మేసేజ్ పెట్టాను’ అని సమాధానమిచ్చారు. ‘మెసేజ్ ఎంటి? ఫోన్ చేసి చెప్పాలి కాదా?’ అంటూ మంత్రి మందలించారు.
అనంతరం మంత్రి మాటాడుతూ.. ఎగువ నుంచి వచ్చే నీటి గురించి ఆంధ్రా అధికారులతో తెలుసుకుని 17వ తేదీనే ప్రాజెక్టు గేట్లు తెరిగి ఉంటే ఈ ప్రమాదం జరిగేదికాదని అన్నారు. అధికారుల సమన్వయలోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. 1987లో కూడా ఇదే ప్రదేశంలో గండి పడిందని, దానిని అధికారులు దృష్టిలో పెట్టుకోకపోవడం ఏమిటని మందలించారు. రైతులు తనకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే కలెక్టర్, ఎస్పీలను తాను అప్రమత్తం చేశానని అన్నారు. ముందుగా ఎస్పీ నారాయణపురం చేరుకొని వరదలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడారని అన్నారు.
‘లైటింగ్ తగ్గి హైలికాప్టర్లు తిరగకపోతే ఎంత ప్రాణనష్టం జరిగి ఉండేది?’ అంటూ ఐబీ అధికారులను మందలించారు. 47 ట్రాన్సఫార్మర్లు దెబ్బతిన్నాయని, 19 విద్యుత్ స్తంభాలు విరిగిపోయ్యాయని అన్నారు. వెంటనే విద్యుత్ పనుల ప్రారంభించి గ్రామాలకు విద్యుత్ అందించినట్లు డీఈఈని ఆదేశించారు. నారాయణపురం, బచ్చువారిగూడెం, గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాల్లో 500 ఎకరాల పంట నష్టం జరిగిందని, 150 ఎకరాల్లో వరినార్లు కొట్టుకుపోయ్యాయని ఏడీఏ అఫ్జల్‌బేగం తెలిపారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పంట చేలను పరిశీలించి నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేయాలని ఆదేశించారు. గండి పడడానికి గల కారణాలపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌కు సూచించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

