బోనకల్లు, ఆగస్టు 16 : బోనకల్లు మండలం వైరా- జగ్గయ్యపేట ప్రధాన రోడ్డు మార్గంలోని రావినూతల – జానకిపురం గ్రామాల మధ్య శనివారం భారీ మర్రి చెట్టు రోడ్డుపై కూలింది. ఎన్నో ఏళ్లుగా పెద్ద పెద్ద ఊడలతో ఉన్న మర్రిచెట్టు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. భారీ వృక్షం రోడ్డుపై పడే సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. వైరా జగ్గయ్యపేట ప్రధాన రోడ్డు మార్గం కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలిసిన స్థానిక ఎస్ఐ పొదిలి వెంకన్న తన సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడికి చేరుకుని రోడ్డుపై పడి ఉన్న వృక్షాన్ని ప్రోక్లైన్ ద్వారా తొలగించారు. దీంతో వాహనదారులు యధావిధిగా రాకపోకలు సాగించారు.
Bonakal : వైరా- జగ్గయ్యపేట ప్రధాన రోడ్డుపై కూలిన భారీ వృక్షం