మధిర, జూలై 31 : చేతులు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం భద్రంగా ఉంటుందని దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీరాజ్ నాయక్ అన్నారు. గురువారం మండలం తొండల గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో గల తొర్లపాడు ప్రైమరీ స్కూల్ నందు పిల్లలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాలు మేరకు పీహెచ్సీ దెందుకూరు నందు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పృథ్వీరాజ్ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు.
హెల్త్ సూపర్వైజర్ లంకా కొండయ్య విద్యార్థులకు ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించారు. భోజనం, ఇతర పదార్దాలు తినే ముందు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్.గోపిచంద్, ఏఎన్ఎం భారతి, ఆశ కార్యకర్త విజయమ్మ, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, గుమ్మస్తా శివ పాల్గొన్నారు.