మధిర, సెప్టెంబర్ 05 : రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని మధిర ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జి.వెంకటేశ్వర్లు, పి.అరుణ్ కుమార్ అన్నారు. మధిర మండల జర్నలిస్టులు బాణాల రామకృష్ణ, నీరుకొండ మురళి రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని శుక్రవారం ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్లో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఉచిత సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు నాళ్ల శ్రీనివాసరావు, కోశాధికారి కాకరపర్తి శ్రీనివాసరావు, ఉప కోశాధికారి శ్రీధర్, ప్రచార కార్యదర్శి అర్జున్, ఉపాధ్యక్షుడు లిక్కి రవీందర్, సహాయక కార్యదర్శిలు మహంకాళి వెంకట శ్రీనివాసరావు, చారుగొండ్ల నరసింహమూర్తి, కార్యవర్గ సభ్యులు ఆదూరి విజయరాజ్, దోర్నాల వేణు, అయ్యప్ప, బాణాల శంకరాచారి, వేల్పుల పవన్, మోహన్ రావు, పగిడిపల్లి ప్రభాకర్, విజయ భాస్కర్ పాల్గొన్నారు.