బోనకల్లు, ఏప్రిల్ 16 : చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఐసీడీఎస్ సూపర్వైజర్లు రమాదేవి, సుజాత అన్నారు. బుధవారం పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంఓలని అంగన్వాడీ కేంద్రంలో చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లులకు, పిల్లలకు చిరు ధాన్యాలతో చేసిన వంటకాల వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించారు. పోషక పదార్థాలు సక్రమంగా తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.
అదేవిధంగా రాయన్నపేట గ్రామంలో మా ఇంటి మణి దీపం కార్యక్రమంలో ఆడపిల్లకు జన్ననిచ్చిన దంపతులను సన్మానించి స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ రమాదేవి, వైద్య అధికారి డాక్టర్ స్రవంతి, ఎంపిఓ సుబ్రహ్మణ్య శాస్త్రి, అంగన్వాడి టీచర్లు రమాదేవి, శిరీష, నాగమణి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.