టేకులపల్లి, ఏప్రిల్ 9: వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. మండలంలోని దాస్తండాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు నిర్వహించి కేసీఆర్ చరిత్రలోనే గొప్ప స్థానం పొందారని గుర్తు చేశారు.
ఆయన స్థానం తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచి ఉందన్నారు. 27న జరుగనున్న రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోడ బాలు, బానోత్ రామ, చీమల సత్యనారాయణ, జాలాది అప్పారావు, మాలోతు పూల్సింగ్, సురేందర్, కుమ్మరి కిరణ్, రవికుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.