రఘునాథపాలెం, అక్టోబర్ 5: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘జీవీ మాల్’ ఖమ్మంలోని వైరారోడ్డులో శనివారం నూతన షాపింగ్‌మాల్‌ను ప్రారంభించింది. దీనికి ముఖ్యఅతిథిగా సినీ నటి కీర్తి సురేశ్ హాజరై అభిమానులతో సందడి చేశారు. ‘నేను.. మీ కీర్తి సురేశ్‌ని. బాగున్నారా..’ అంటూ మొదట అభిమానులను పలకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ముందుగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జీవీ మాల్ వస్త్ర సముదాయాన్ని ప్రారంభించారు.
పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన షాపింగ్‌మాల్స్ ఇక్కడి ప్రజల జీవన శైలి, అభిరుచులకు అనుగుణంగా అంతర్జాతీయ ఫ్యాషన్ ైస్టెల్స్లో అందించాలనే ఉద్దేశంతో ఖమ్మంలోనూ ఏర్పాటు చేయడం సంతోషమని పేర్కొన్నారు. నగర ప్రజలు దసరా పర్వదినం సందర్భంగా చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సినీనటి కీర్తి సురేశ్ షాపింగ్‌మాల్ మొత్తం కలియతిరిగి వస్త్ర దుకాణంలో అందుబాటులో ఉంచిన సరికొత్త రకాలను పరిశీలించారు. జబర్దస్త్ టీం సభ్యులు ఆటో రాంప్రసాద్, హైపర్ ఆదీలు చేసిన స్కిట్స్ అలరించాయి. మేయర్ పునకొల్లు నీరజ, షోరూం అధినేతలు గుర్రం ఉమామహేశ్వరరావు, గుర్రం వాసు, గుర్రం మురళి, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి పాల్గొన్నారు.