సారపాక, ఏప్రిల్ 19: తెలంగాణలో నిరుపేదల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పరితపించే మహోన్నతుడు మన ముఖ్యమంత్రి అని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. మండలంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. తొలుత సారపాక భాస్కర్‌నగర్‌లో రూ.3.6 కోట్లతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రాంభించారు. 60 మంది లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నిరుపేద లబ్ధిదారులకు ప్రభుత్వం అందించిన డబుల్బెడ్రూం ఇళ్లను ఎవరూ కిరాయిలకు ఇవ్వొద్దని, అందులో ఉండకుండా తాళాలు వేసి వెళ్లొద్దని సూచించారు. అధికారులు వారం రోజుల్లోగా ఇక్కడ సకల సదుపాయాలనూ కల్పిస్తారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు లభించినవారు అదృష్టవంతులయ్యారన్నారు.
ఇకపై ఇల్లు నిర్మించుకునేందుకు సొంత స్థలం ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం రూ.3 లక్షలను అందిస్తున్నదని గుర్తుచేశారు. సారపాకను పూర్తిగా అభివృద్ధి చేసిన ఘనత తనదేనన్నారు. ప్రజలు ప్రతిపక్షాల మాయలో పడకుండా సీఎం కేసీఆర్ కృతజ్ఞులుగా ఉండాలని కోరారు. తహసీల్దార్ శ్రీనివాసయాదవ్, ఎంపీడీవో వివేక్‌రామ్, ఎంపీవో సునీల్‌శర్మ, డీఈ రాములు, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, జక్కం సుబ్రహ్మణ్యం, కొనకంచి శ్రీను, గుల్మహ్మద్, కనకాచారి, సాబీర్‌పాషా, బానోతు శ్రీను, చిరంజీవి, ఎడమకంటి సుధాకర్‌రెడ్డి, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, చల్లకోటి పూర్ణ, పొడియం నరేందర్, తిరుపతి ఏసోబు, బాలి శ్రీహరి, అంజి, ఐటీడీఏ డీఈ రాములు, ఏఈలు వెంకటేశ్వర్లు, మౌనిక, గోనెల నాని, చల్లకోటి పూర్ణ, ముసలిమడుగు సర్పంచ్ కుర్సం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపహాడ్, ఏప్రిల్ 19: తెలంగాణ ప్రభుత్వం నూతన విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త సొబగులు అద్దుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. మండలంలో సుమారు రూ.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. తొలుత కృష్ణసాగర్ ఎస్సీ, ఎస్టీ కాలనీలు, ముసలిమడుగు, సారపాక ఒడియా క్యాంపు, భాస్కర్‌నగర్ గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం చెరువు సింగారంలో రూ.92 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం బూర్గంపహాడ్‌లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు – మన బడి’లో భాగంగా రూ.7 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోందని అన్నారు. పలు కుటుంబాలను పరామర్శించారు.