సీఎం సభ కోసం 30 ఏళ్ల వృక్షాలు నేలమట్టం
మధిర నియోజకవర్గం చింతకానిలో ఈ నెల 30న ‘రైతు ఆశ్వీరాద సభ’ పేరుతో ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ‘పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు’ అంటూ సూక్తులు చెబుతున్న ప్రభుత్వం.. వాటిని తానే పాటించడం లేదు. మొక్కలను విరివిగా నాటాలని, వాటిని సంరక్షించాలని ఏటా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్న ప్రభుత్వం..
- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మధిర పర్యటన కోసం ప్రభుత్వ విధ్వంసం
- రైతు భరోసా పేరిట సభ పెట్టి భారీ చెట్లను ముక్కలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- ఖమ్మం – బోనకల్లు రహదారిపై వృక్షాల నరికివేతపై వన ప్రేమికుల ఆగ్రహం
మధిర, జూన్ 28: మధిర నియోజకవర్గం చింతకానిలో ఈ నెల 30న ‘రైతు ఆశ్వీరాద సభ’ పేరుతో ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ‘పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు’ అంటూ సూక్తులు చెబుతున్న ప్రభుత్వం.. వాటిని తానే పాటించడం లేదు. మొక్కలను విరివిగా నాటాలని, వాటిని సంరక్షించాలని ఏటా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్న ప్రభుత్వం..
సీఎం సభ కోసం ఎన్నో ఏళ్లనాడు నాటిన భారీ వృక్షాలను యంత్రాల సాయంతో క్షణాల్లో కూల్చివేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద ఈ నెల 28, 29 తేదీల్లో ‘రైతు మేళా’; రైతుభరోసా నిధుల విడుదల కోసం ఈ నెల 30న ‘రైతు ఆశీర్వాద సభ’ పేరుతో పెద్ద ఎత్తున సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది.

అయితే, సభకు సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నందుకు సమీపంలోని రహదారులను, వాటి పరిసరాలను పరిశుభ్రం చేసింది. సీఎం చేరుకునేందుకు తాతాలిక రోడ్డు మార్గానికి, కాన్వాయ్ రాకపోకలకు ఆ మార్గంలో రహదారి వెంట చెట్లు అడ్డంగా ఉన్నాయంటూ వాటిని నేలమట్టం చేసింది. ఆ మార్గంలోని బాటసారులకు గత 20, 30 ఏళ్లుగా నీడనిస్తున్న పెద్ద పెద్ద చెట్లను మొదళ్లతో సహా నరికివేసింది. భారీ వృక్షాలను యంత్రాలతో కూల్చివేసింది. వాటిని ముక్కలు ముక్కలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించింది. దీంతో ఖమ్మం – బోనకల్లు రహదారిపై భారీ వృక్షాల నరికివేతపై వన ప్రేమికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

