వీరలక్ష్మీ నమస్తుభ్యం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం 8వ రోజు లక్ష్మీతాయారు అమ్మవారు ‘వీరలక్ష్మి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు
- నేడు మహాలక్ష్మి అవతారం
భద్రాచలం, అక్టోబర్ 3 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం 8వ రోజు లక్ష్మీతాయారు అమ్మవారు ‘వీరలక్ష్మి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలు, పండ్లరసాలు, తులసీమాలలు, నారీకేళ జలములతో ప్రత్యేక అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు అధికసంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు.
మధ్యాహ్నం 3గంటలకు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, లక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహించారు. చిత్రకూట మండపంలో 108పారాయణదారులు శ్రీమద్రామాయణంలోని యుద్ధకాండను పారాయణం చేశారు. ముందుగా ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చిత్రకూట మండపానికి తీసుకొని వచ్చి, సూర్యప్రభ వాహనంపై ఉంచి పూజలు చేశారు. సాయంత్రం తాతాగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ జరిపారు.
నేడు మహాలక్ష్మి అలంకారంలో..
భక్తుల కోర్కెలను తీర్చడానికి లక్ష్మీదేవి మంగళవారం మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే ఐష్టెశ్వర్యాలు కలగడంతోపాటు అన్నింటా విజయం సిద్ధిస్తుందని పండితులు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

