కారేపల్లి, సెప్టెంబర్ 26 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి, ఏనుకూరు, జూలూరుపాడు, వైరా, కొణిజర్ల మండలాల్లో గల గ్రామాల్లో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గా మాత శుక్రవారం ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఉత్సవ నిర్వహణ కమిటీల ఆధ్వర్యంలో అమ్మవారి విశిష్టతను వివరించారు. పలువురు దంపతులు పీటలపై కూర్చొని అమ్మవారి పూజలో పాల్గొన్నారు.