ఇంటి నిర్మాణాన్ని తమతోపాటు పిల్లలకు, భవిష్యత్ తరాలకూ జ్ఞాపకంగా మిగిలిపోయేలా పక్కా ప్రణాళికతో నిర్మిస్తారు. అయితే, టెక్నాలజీ అంతగా లేని ఆ రోజుల్లోనే అన్నిహంగులతో నిర్మించిన అ‘పూర్వ’ కట్టడం నేటికీ కళకళలాడుతోంది. ఆ రోజుల్లో సిమెంట్ లేదు. కరెంట్ లేదు. ఎద్దులతో తొక్కించిన గానుగ సున్నం, సుద్దతో శతాబ్దమున్నర క్రితం నిర్మించిన డూప్లెక్స్ భవనం ఇప్పటికీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. కూసుమంచిలో 150 ఏళ్లక్రితం కేశరాజు పాపయ్య అనే వ్యక్తి చతుర్శాల భవంతిని నిర్మించారు.
మూడు తరాల జ్ఞాపకాలు, అనుభూతులను కొనసాగిస్తూ నాలుగోతరమూ ఈ పురాతన భవంతిలోనే
నివసిస్తున్నది. తాత ముత్తాతల వారసత్వంగా ఉన్న ఇంటిని కాపాడుకుంటూ వస్తున్నది. నాలుగోతరం
వారసులు దేశవిదేశాల్లో స్థిరపడినప్పటికీ శుభాకార్యాలు, పండుగలు పబ్బాలకు ఇక్కడి ఇంటికే వస్తారు.
సందడిగా గడుపుతారు. ఆ భవంతి విశేషాలు, చెక్కుచెదరని నిర్మాణ కౌశలంపై ‘నమస్తే’ నేటి సండే
స్పెషల్.
-కూసుమంచి, డిసెంబర్ 17
ఈ చిత్రంలో కనిపిస్తున్న కట్టడం చతుర్శాల భవంతి. 150 ఏళ్ల కిందట కేశరాజు పాపయ్య అనే మోతుబరి
కూసుమంచిలో ఈ ఇంటిని నిర్మించాడు. మూడు తరాల జ్ఞాపకాలు, అనుభూతులను కొనసాగిస్తూ నాలుగో
తరమూ ఈ పురాతన భవంతిలోనే నివసిస్తున్నది. తాత ముత్తాతల వారసత్వంగా ఇంటిని కాపాడుకుంటూ
వస్తున్నది. నాలుగోతరం వారసులు దేశ విదేశాల్లో స్థిరపడినప్పుటికీ శుభాకార్యాలు, పండుగలు పబ్బాలకు
స్వస్థలానికి వస్తారు. సందడిగా గడుపుతారు. ఆ భవంతి విశేషాలు, చెక్కుచెదరని నిర్మాణ కౌశలంపై ‘నమస్తే’
నేటి సండే స్పెషల్.
– కూసుమంచి, డిసెంబర్ 17
ఆ ఇల్లే మాకు తీపి జ్ఞాపకం..
మా ప్రాథమిక విద్య స్థానికంగా జరిగింది. మిగిలిన చదువులు ఖమ్మం, హైదరాబాద్లో సాగాయి. తరువాత
అమెరికా వెళ్లి అక్కడ పదేళ్లు ఉన్నాం. తిరిగి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాం. ఎక్కడికి వెళ్లినా, ఎంతదూరం
వెళ్లినా మా సొంత ఊరు, మా తాతలు కట్టించిన ఇల్లు మా అందరికీ తీపి జ్ఞాపకమే. అందుకే దాన్ని
పదిలంగా చూసుకుంటున్నాం. మా అమ్మా, చిన్నమ్మ ఇక్కడే ఉంటారు. ఏమాత్రం అవకాశం దొరికినా వారి
కోసం ఇక్కడికి వస్తుంటాం. మా నాన్న కేవైవీ రంగారావు రాజకీయ నాయకుడిగా, మా బాబాయి కేవీ
హన్మంతరావు న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితులు. వారి ఆలోచనలతో సేవా
కార్యక్రమాలను కొనసాగిస్తాం. ఒక లైబ్రరీ ఏర్పాటు చేశాం. యువతకు ఆటస్థలం ఏర్పాటు చేస్తున్నాం.
-లక్ష్మీ నర్సింహారావు
మా అందరికీ ఇష్టమైన ఇల్లు..
మా చదువులన్నీ ఖమ్మం, హైదరాబాద్ వంటి నగరాల్లో పూర్తయ్యాయి. మా కుటుంబంలో ఏ కార్యక్రమం
జరిగినా, ఏ కార్యమైనా మా పెదనాన్న, మా నాన్న కలిసి ఇక్కడి నుంచే మొదలు పెట్టేవారు. వారి జ్ఞాపకాలు
ఇప్పటికే పదిలమే. వారి సంకల్పం మాకు ఎంతో బలం. మేం ఎక్కడ ఉన్నా పండుగలకు, శుభకార్యాలకు
తప్పకుండా ఇక్కడికి వస్తాం. ఇక్కడే ఉంటాం. అవకాశం దొరికితే పెద్దమ్మ, అమ్మతో గడుపుతాం. 150
సంవత్సరాలు పూర్తి అవుతున్న మా ఇల్లు అంటే మా అందరికీ చాలా చాలా ఇష్టం.
-కల్యాణ్