దమ్మపేట, జనవరి 5: చెవిలో పూలతో చెవిలో పూలతో జీసీసీ హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో నాలుగో రోజు ఆదివారం చెవిలో పూలు పెట్టుకొని సమ్మె శిబిరంలో కూర్చొని వినూత్నంగా తమ నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) హమాలీలు భద్రాద్రి జిల్లా దమ్మపేటలో నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో నాలుగో రోజు ఆదివారం చెవిలో పూలు పెట్టుకొని సమ్మె శిబిరంలో కూర్చొని వినూత్నంగా తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ వచ్చి హమాలీలకు సంఘీభావంగా మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించలేని స్థితిలో విమర్శించారు.
గత అక్టోబర్లో కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చిందని అన్నారు. అంగీకరించిన ఎగుమతులు, దిగుమతుల ధరలపై జీవో ఇవ్వకుండా, వేతన బకాయిలు చెల్లించకుండా నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తూ హమాలీల బతుకులతో ఆడుకుంటోందని మండిపడ్డారు. గత ఒప్పందాలకు భిన్నంగా సంవత్సర కాలం గడిచినా నేటికీ ప్రభుత్వం స్పందించకపోవడమంటే హమాలీ కార్మికులను ఆర్థికంగా నష్టపర్చడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హామీలను నెరవేర్చి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీసీసీ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు భోగి సత్యం, ప్రసాద్, వెంకట్, నరసయ్య, సత్యనారాయణరాజు పాల్గొన్నారు.