లక్ష్మీదేవిపల్లి, మార్చి 11 : లక్ష్మీదేవిపల్లి మండలంలోని గట్టుమల్ల-మైలారం ప్రధాన రహదారి ప్రమాద భరితంగా మారింది. గట్టుమల్ల ఫారెస్ట్ నర్సరీ దాటిన తర్వాత రహదారి కోతకు గురికావడంతో అధికారులు అక్కడ కల్వర్టు నిర్మించారు. కల్వర్టు నిర్మించి అక్కడ ఉన్న గుంటను మాత్రం పూడ్చడం మరిచారు.
అది కాస్త రోడ్డుకు పక్కనే ఉండడంతో రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహానాలను తప్పుకుని పక్కకు వెళ్లాల్సి వస్తుండడంతో గుంటలో పడి ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాహనదారులు వాపోయారు. ఇప్పటికే ఆ గుంటలో పడి అనేక ప్రమాదాలు జరిగాయని స్థానికులు, వాహనదారులు చెబుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.