Gongadi Trisha | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9.(నమస్తే తెలంగాణ) : భద్రాద్రి జిల్లా పేరును చరిత్రలో నిలిపిన యువ క్రికెటర్ గొంగడి త్రిషను కొత్తగూడెం గాంధీ పదం చారిటబుల్ కన్వీనర్ చింతల చెర్వు గేర్శం సన్మానించారు. కొత్తగూడెంలో పలు సేవా కార్యక్రమాలు చేసే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సికింద్రాబాద్లోని త్రిష నివాసానికి వెళ్లి సన్మానం చేశారు. ఈ సందర్భం గా ఆయన ఆమె కీర్తిని క్రికెట్లో చూపిన ప్రతిభను అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.