వైరా టౌన్, సెప్టెంబర్ 01 : వైరా మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు దుద్దుపూడి గ్రామంలో గ్రేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని 15వ వార్డు కౌన్సిలర్ నల్లమోతు శైలజ సురేష్ ప్రారంభించారు. గ్రామానికి చెందిన పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ హాస్పిటల్ వైద్య సిబ్బంది, స్థానికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.