కారేపల్లి (కామేపల్లి) సెప్టెంబర్ 24 : ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు మాజీ జడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని దుర్గామాత మండపాలను సందర్శించి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ.. లబ్ధిదారులు సాధ్యమైనంత తొందరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని, ఎంత త్వరగా పూర్తయితే అంత తొందరగా బిల్లులు మంజురవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకపోతుల మహేశ్, జన్నారపు లింగయ్య, భూక్య నాగేంద్రబాబు, వేముల రాంబాబు, గునగంటి నాగరాజు, అశోక్, బత్తుల రాములు, గుడివాడ శ్రీను, రేళ్ల నాగమణి, కళావతి, బండి లక్ష్మీనర్స్, తురక రవి, బండి నాగరాజు, బండి పాపయ్య, గుండ్ల వెంకన్న, పూజారి గణపతి, బొట్ల మధు, పంచాయతీ సెక్రెటరీ శంకర్ పాల్గొన్నారు.