సారపాక/బూర్గంపహాడ్, అక్టోబర్ 8 : మండల అభివృద్ధికి ఐటీసీ కర్మాగారం అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఐటీసీ సీఎస్ఆర్ నిధులు రూ.1.72కోట్లతో తాళ్లగొమ్మూరు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, మోరంపల్లిబంజర, లక్ష్మీపురం, వేపలగడ్డ, ముసలిమడుగు, కృష్ణసాగర్ గ్రామాల్లో బస్షెల్టర్లు, రెడ్డిపాలెం, లక్ష్మీపురం, మోరంపల్లిబంజర్లలో పబ్లిక్ టాయిలెట్స్, సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండల అభివృద్ధికి ఐటీసీ ఎంతగానో సహకరిస్తుందని, వదరల సమయంలో ప్రజలకు నిత్యావసరాలు అందించిందని అన్నారు. ఐటీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఐటీసీ యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి, హెచ్ఆర్ హెడ్ శ్యామ్కిరణ్లకు జడ్పీటీసీ శ్రీలతతో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సత్కరించారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత CM KCR నాయకత్వంలో పినపాక నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. బూర్గంపహాడ్ పర్యటనలో భాగంగా అంజనాపురం, వేపలగడ్డ, లక్ష్మీపురం గ్రామాల్లో రూ.3.40కోట్ల విలువైన సీసీ రోడ్లను ప్రారంభించారు. లక్ష్మీపురం నుంచి టేకులచెరువు వరకు రూ.3కోట్లతో సైడ్‌డ్రైన్ ఏర్పాటు చేసి పరిశ్రమలకు వెళ్లే వాహనాలకు, అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తొలగించామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వివేక్‌రామ్, ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, ఆయా పంచాయతీల సర్పంచ్‌లు పుల్లారావు, భూక్యా శ్రావణి, భూక్యా భారతి, సోంపాక నాగమణి, చిన్నబ్బాయి, కుర్సం వెంకటరమణతో పాటు నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, కొనకంచి శ్రీను, బాలి శ్రీహరి, పోతిరెడ్డి గోవిందరెడ్డి, ఆవుల రామాంజిరెడ్డి, బిజ్జం రాఘవరెడ్డి, పాలెం దివాకర్‌రెడ్డి, చిన్నపరెడ్డి, సాబీర్‌పాషా, శ్రీను, బెజ్జంకి కనకాచారి, బాలి శ్రీహరి, లక్ష్మిచైతన్యరెడ్డి, చల్లకోటి పూర్ణ, మహిళలు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.