పెనుబల్లి, ఆగస్టు 10 : బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ వెళ్తే విలీనానికే వెళ్లారని కొందరు నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆ మాటలు అర్థ రహితమని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇటీవల ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీవిరమణ పొందడంతో వారికి స్థానిక సప్తపదిలో శనివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవులు శాశ్వతం కాదు, మనం చేసిన పనులే శాశ్వతమని, పదవులు ఉన్నా లేకున్నా ప్రజల్లో మమేకమై ఉండాలన్నారు.
అధికారం లేకపోయినా పార్టీ పరంగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకోవాలన్నారు. రోజురోజుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని, భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదవులను తృణాపాయంగా వదిలేశారని, అలాంటి పార్టీ బీఆర్ఎస్ అని, అలాంటిది విలీనం చేయడమేమిటని అన్నారు. అర్థ రహితమైన ఆరోపణలతో మాట్లాడవద్దని హితవు పలికారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15న సీతారామప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందని, ఆ ప్రాజెక్టు మొత్తం కేసీఆర్ చలువే అన్నారు. ఆయన 95 శాతం పనులు చేపిస్తే 5 శాతం పనులు చేసి నీళ్లను ముద్దాడుతూ, భూమిని ముద్దాడుతూ మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, భవిష్యత్‌లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, మాజీ ఎంపీపీ లక్కినేని అలైఖ్యవినీల్, మాజీ జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు,
సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ, మాజీ కోఆప్షన్‌సభ్యులు ఎస్.కే.గౌస్, కోటగిరి సుధాకర్‌బాబు, సోమరాజు రామప్ప, వంగా గిరిజాపతి, తాళ్లూరి శేఖర్‌రావు, బెల్లంకొండ చలపతిరావు, తేళ్లూరి నాగేశ్వరరావు, సూరపురెడ్డి కిరణ్‌రెడ్డి, తడికమళ్ల తాతారావు, చెలికాని నీలాద్రిబాబు, కోమటి ప్రసాద్, దొడ్డపునేని రవి, లగడపాటి శ్రీను, గోదా చెన్నారావు, నరుకుళ్ల సత్యనారాయణ, తెల్లగొర్ల జనార్ధన్ పాల్గొన్నారు.