భద్రాచలం/ దుమ్ముగూడెం/ చర్ల, నవంబర్ 2: భవిష్యత్‌లో అధికారం బీఆర్ఎస్దేనని ఆ పార్టీ భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ సర్కారుపై పోరాడేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి జిల్లా భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెంలలో ఆదివారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం మండలంలోని ప్రతి వార్డులోనూ బీఆర్ఎస్ కమిటీలు వేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలని కోరారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 420 వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. హామీలను అమలుచేయకపోగా కేసీఆర్ అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేసీఆర్ పేరును ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని అన్నారు.
నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మానె రామకృష్ణ, ఆయా మండలాల నాయకులు కోటగిరి ప్రబోద్‌కుమార్, ఆకోజు సునీల్‌కుమార్, కోలా రాజు, ఉడతా రమేశ్, రేపాక పూర్ణచందర్రావు, అంబటికర్ర కృష్ణ, పడిసిరి శ్రీనివాసరావు, కొల్లం ప్రేమ్‌కుమార్, బాసిబోయిన మోహన్‌రావు, కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, కాపుల సూరిబాబు, అనిల్, ఏడుకొండలు, ప్రసాద్, రమేష్, యువరాజు, నర్సింహులు, శివ, గణేష్, నాగరాజు, సలోమి, రాణి, ప్రియాంక, ప్రదీప్, సాగి శ్రీనివాసరాజు, రేసు లక్ష్మి, బొల్లి వెంకట్రావు, కణితి రాముడు, జానీపాషా, తునికి కామేశ్, అపకా వీర్రాజు, కొత్తూరు సీతారామారావు,
జోగి వెంకటరమణ, వాగే వెంకటేశ్వరరావు, దామెర్ల శ్రీనివాస్, కొత్తా మల్లేశ్, రామిరెడ్డి, జ్యోతి, సావిత్రి, సాగి వర్మ, మోతుకూరి శ్రీకాంత్, లంకా శివ, జుంజూరు జయసింహ, భూక్యా చందు, కాటిబోయిన వెంకటేశ్వరరావు, గంగరాజు, వెంకటేశ్వరరావు, సోమయ్య, కామేశ్, వెంకటేశ్, సూర్యనారాయణ, రమేశ్, శ్రీను, ప్రసాద్, నాగేశ్వరరావు, రాము, సోయం కృష్ణబాబు, రాంబాబు, కిరణ్, కుర్సం రామారావు, సోయం రాజారావు, లంకరాజు, దొడ్డి తాతారావు, పోలిన రామచంద్రరావు పాల్గొన్నారు. అనంతరం, చర్లలో ఆదివారం అనారోగ్యంతో మరణించిన బాలిక ప్రవళిక భౌతికకాయానికి నివాళులర్పించారు.