మణుగూరు టౌన్, నవంబర్ 6: నిత్యం ప్రజలతో మమేకమై పార్టీని గ్రామ, మండల, జిల్లాస్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. మణుగూరులో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని, ఆరు గ్యారెంటీలను విస్మరించారని ఆరోపించారు. వాటిని అమలు చేసేంత వరకు ప్రభుత్వాన్ని, మంత్రులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు మండలాలకు కమిటీలను ప్రకటించారు. భద్రాచలం పట్టణ కన్వీనర్‌గా ఆకోజు సునీల్‌కుమార్, కో కన్వీనర్‌గా రేపాక పూర్ణచందర్రావు, దుమ్ముగూడెం మండల కన్వీనర్‌గా కణితి రాముడు, కో కన్వీనర్‌గా జానీ, చర్ల మండలం కన్వీనర్‌గా దొడ్డి తాతారావు, కో కన్వీనర్‌గా పవన్‌కుమార్, మణుగూరు మండల కన్వీనర్‌గా కురి నాగేశ్వరరావు, కో కన్వీనర్‌గా బొలివెట్టి నవీన్, మణుగూరు టౌన్ కన్వీనర్‌గా కుంట లక్ష్మణ్, కో కన్వీనర్‌గా రమేశ్‌లను నియమించినట్లు వెల్లడించారు.