మణుగూరు టౌన్, జనవరి 6 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
సంక్రాంతి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున నియోజకవర్గ ఇన్చార్జిలు అన్ని గ్రామా ల్లో సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి అభ్యర్థుల ఎంపికపై ఒక అవగాహనకు రావాలని సూచించారు. అన్ని కమిటీలను పండుగలోపు సమావేశపర్చాలని, ఆ తర్వాత జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకుందామని పేర్కొన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.