కారేపల్లి,జూన్ 19 : ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జాగ్రత్తలు పాటించాలని మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పిలుపునిచ్చారు. సింగరేణి మండల పరిధిలోని గేటు రేలకాయలపల్లి మాజీ సర్పంచ్ బానోతు సత్రం సతీమణి బానోత్ సరోజ ఇటీవల గుండెపోటుతో మృతి చెందింది. సరోజ సంస్మరణ సభ గురువారం రేలకాయలపల్లి లో జరిగింది. రాములు నాయక్ సంస్మరణ సభకు హాజరై సరోజ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి భర్త సంక్రాంతో పాటు ఆమె కుమారులు కూతుర్లను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇటీవల కాలంలో అనేకమంది గుండెపోటుతో మరణిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అందరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మాలోత్ శకుంతల, మాజీ జెడ్పిటిసిలు వాంకుడోత్ జగన్, పున్నం వీరేందర్, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, సొసైటీ ఉపాధ్యక్షుడు ధరావత్ మంగీలాల్, డైరెక్టర్లు అడ్డగోడ ఐలయ్య, బానోత్ హీరోలాల్, నాయకులు అజ్మీర వీరన్న, బానోతు రామ్మూర్తి, అడప పుల్లారావు, కడియాల రాజు, బానోత్ శంకర్, భూక్య రమణ, వికాస్, గణిత సత్యనారాయణ, ముత్యాలరావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.