టేకులపల్లి, మే16 : కాంగ్రెస్ వైఫల్యాలను గ్రాడ్యుయేట్లకు వివరించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం టేకులపల్లి మండలం దాస్‌తండాలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేలా బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాలు, పట్టణాల్లో పట్టభద్రులను కలిసి అవగాహన కల్పించాలని కోరారు. ఈ నెల 27న జరిగే పోలింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఓటు రాకేశ్‌రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్కినేని సురేందర్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, కంభంపాటి రేణుక, తాతా గణేశ్, శీలం రమేశ్, పరుసు వెంకటేశ్వర్లు, ఎంటీసీలు శీలంశెట్టి రమేశ్, దాస్యం ప్రమోద్, జాలది అప్పారావు, భూక్య బాలకృష్ణ, నాయకులు సిలివెరి సత్యనారాయణ, జెకె శ్రీను, పానుగట్టి రాధ, మాలోతు పూల్‌సింగ్, భూక్య రాజా తదితరులు పాల్గొన్నారు.