ఖమ్మం, సెప్టెంబర్ 6: ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని మున్నేరు వరద బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పంపించిన నిత్యావసర సరుకుల వాహనాలను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జెండా ఊపి ప్రారంభించారు.
శుక్రవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ కర్నాటి కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు నాగచంద్రారెడ్డి, మాటేటి కిరణ్, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, బిచ్చాల తిరుమలరావు, జ్యోతిరెడ్డి పాల్గొన్నారు.