తిరుమలాయపాలెం : చెరువులో చేపలు పట్టేందుకు చెరువు తూములను ధ్వంసం చేసిన చేపల కాంట్రాక్టర్‌పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు ( Police Compalint ) చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలులో జరిగిన ఘటనా వివరాలను ఇరిగేషన్ శాఖ ఏఈ రామకృష్ణ వెల్లడించారు.

బీరోలు పెద్ద చెరువు రెండు తూములను చేపల కాంట్రాక్టర్ ( Fisheries Contractor) శివ, మత్స్య సొసైటీ సభ్యులు హరినాథ్, తురక మల్లయ్య , తదితరులు ధ్వంసం చేసినట్లు చెప్పారు. గత నెలలో ఒక తూమును ధ్వంసం చేయగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. వారిపై కేసు నమోదు అయినప్పటికీ రెండో సారి కూడా తూములను ధ్వంసం చేసి నీటిని బయటికి పంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇరిగేషన్ డీఈ రమేష్ రెడ్డి, పోలీసులు ధ్వంసమైన తూములను పరిశీలించారు. తూములను ధ్వంసం చేసిన చేపల కాంట్రాక్టర్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.