శాసనసభ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఆదివారం బీ ఫారాలు ఇవ్వడంతోపాటు మేనిఫెస్టోను ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రకటించిన మేనిఫెస్టో మరింత ఊరట నిచ్చిందని లబ్ధిదారులు ఆనందపడుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలిపిన ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే విధంగా మేనిఫెస్టోను రూపొందించడంపై ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు ముక్తకంఠంతో సీఎం కేసీఆర్‌కు జై కొడుతున్నారు. పథకాల ప్రదాత, వరాల నేత అంటూ మెచ్చుకున్నారు. అలాగే తమ నియోజకవర్గ అభ్యర్థులు సీఎం కేసీఆర్ చేతులమీదుగా బీఫామ్ తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
– ఖమ్మం, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది. అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా మేనిఫెస్టో ప్రకటించారు. రాష్ట్రంలో పేదలందరికీ రూ.5లక్షల బీమా, సన్నబియ్యం, రూ.400లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద ప్రతినెలా రూ.3వేలు వంటి పథకాలు మేనిఫెస్టోలో ప్రకటించడం హర్షణీయం.
– నర్సింహారావు, సత్తుపల్లి
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేసేందుకు.. ప్రభుత్వ పథకాలతో అర్హులకు భరోసా కల్పించే విధంగా మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, లబ్ధిదారులు ఆదివారం సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రకటించిన మేనిఫెస్టో మరింత ఊరట నిచ్చిందని లబ్ధిదారులు ఆనందపడుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలిపిన ప్రభుత్వం అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా మేనిఫెస్టోను రూపొందించడంపై ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు ముక్తకంఠంతో సీఎం కేసీఆర్‌కు జై కొడుతున్నారు. అలాగే అభ్యర్థులు బీఫామ్ అందుకోవడాన్ని హర్షిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
– ఖమ్మం, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉందని, తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు బీమా ఇవ్వడం, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, పేదింటి మహిళకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందిస్తానని ప్రకటించడం సీఎం కేసీఆర్‌కు పేదలు, మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు పంట పెట్టుబడి సాయాన్ని రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంచడం మంచి పరిణామమన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం సీఎం కార్యదీక్షకు నిదర్శనమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు బీమా, సన్నబియ్యం, మహిళలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందించేలా ఉండడం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఆసరా పింఛన్‌ను విడతలవారీగా రూ.5వేలు, దివ్యాంగులకు రూ.6వేలు పెంచేందుకు మేనిఫెస్టోలో ప్రకటించడం ఆర్థిక భరోసా కల్పించడమే. పంట పెట్టుబడి సాయాన్ని రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంచుతూ ప్రకటన చేయడం మంచి పరిణామం.
దేశంలో ఎవరూ అమలు చేయని, ప్రవేశపెట్టని ప్రతి ఇంటికి రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా దేశ చరిత్రలో ప్రప్రథమం. ఇలాంటి పథకాలు కుటుంబాలకు ఆసరాగా ఉంటాయి. ప్రతి ఇంటికి బీమా సౌకర్యం కల్పించడం మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఆరాధ్య దైవంగా మారారు.
– గుడ్ల రంజిత్, గొల్లగూడెం, కరకగూడెం మండలం
బీఆర్ఎస్ మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. పేద కుటుంబాల్లోని తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం అందజేస్తామని ప్రకటించడం శుభ పరిణామం. స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు, 400 లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలు పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతాయి. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– నిట్టా సామ్రాజ్యం, అనంతారం, కరకగూడెం మండలం
అన్ని వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా రూపొందించిన మేనిఫెస్టో బాగుంది. ఆసరా పింఛన్లు రూ.5వేలు, దివ్యాంగులకు రూ.6వేలు ప్రకటించడం పట్ల ఆయా వర్గాలు సంతోషంగా ఉన్నాయి. మేనిఫెస్టోలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. గ్యాస్ సిలిండర్ రూ.400లకే ఇవ్వడం అన్ని వర్గాలకు ఆనందమే. సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు.
– చిట్టి సతీశ్, కరకగూడెం మండలం
వచ్చే ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో ప్రతి ఇంటికి ధీమా కలిగిస్తుంది. 2014 నుంచి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉంది. కేసీఆర్ బీమా, ఆసరా పింఛన్, రైతుబంధు పెంపు, పేద మహిళలకు నెలకు రూ.3వేల చొప్పున అందించడం ధీమాగా ఉంటుంది.
– ఇస్లావత్ బాలు, సంపత్‌నగర్, టేకులపల్లి మండలం
సీఎం కేసీఆర్ మూడుసార్లు పింఛన్ పెంచి దివ్యాంగుల్లో భరోసా నింపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పింఛన్‌ను రూ.1,500, రూ.3,016లకు పెం చడంతోపాటు ఇటీవల రూ.4,016 చేశారు. మరోమారు ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,016కు పెంచుతున్నట్లు ప్రకటించడం హర్షణీయం. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– గోనె రాంబాబు, దివ్యాంగుడు, మోరంపల్లిబంజర, బూర్గంపహాడ్ మండలం
సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట దేవుడిగా మారారు. దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచడం చాలా సంతోషంగా ఉంది. ఆత్మైస్థెర్యంతో జీవించడానికి దివ్యాంగులకు భరోసా కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. జీవితాంతం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. పల్లెల పెద్దరాములు, దివ్యాంగుడు, కొక్కెరేణి.
సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సౌభాగ్యలక్ష్మి పథకం మహిళలకు భరోసాగా నిలుస్తుంది. అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.3వేల భృతి ఇవ్వడమే కాకుండా గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకే అందిస్తానని ప్రకటించడం బాగుంది. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందించనుండడం శుభ పరిణామం.
– లెక్కల ఇందిర, సారపాక
నిరుపేద మహిళలకు గౌరవ భృతి రూ.3వేలు ఇస్తామని ప్రకటించడం గొప్ప వరం. రూ.400లకే గ్యాస్ ఇవ్వడం వల్ల పేద వర్గాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. మ్యానిఫెస్టోలో మహిళలకు మంచి ప్రాధాన్యత ఇచ్చినందున బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఇస్లావత్ అచ్చమ్మ, సర్పంచ్, ఇస్లావత్‌తండా
పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను రూపొందించడం బాగుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆసరా, రైతుబంధు పెంపు, తెల్లకార్డుదారులకు సన్నబియ్యం వంటి పథకాలను ప్రజలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం కేసీఆర్ ముందుంటారు.
– పాయం నర్సింహారావు, ఆళ్లపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
రైతులకు మేలు చేసే పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. రైతుబంధును పెంచుతూ రూ.16 వేలు చేయడం చాలా సంతోషంగా ఉంది. రైతులకు ఇంత కన్నా ఏం కావాలి. రైతులోకం సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టో చాలా బాగుంది.
– ఈసం సమ్మయ్య, కొత్తూరు, కరకగూడెం మండలం
రాష్ట్రంలో రైతులకు గతంలో ఇచ్చే ఎకరాకు రైతుబంధు సాయం రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంచుతామని ప్రకటించడం హర్షణీయం. అలాగే ఆసరా పింఛన్‌ను మరింత పెంచడం, ఆరోగ్యశ్రీ బీమాను రూ.10లక్షల నుంచి రూ.15లక్షలకు పెంచడంతోపాటు మేనిఫెస్టోలో నూతన పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించడం అభినందనీయం.
– కంచర్ల రమాదేవి, సర్పంచ్, కాకర్లపల్లి
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉంది. పేదలు, మధ్యతరగతి, రైతాంగం, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు భరోసా కల్పిస్తుంది. మేనిఫెస్టో ప్రకటనతో విపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ మూడోసారి అధికారాన్ని చేపట్టడం ఖాయం.
– చాట్ల పరుశురామ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు
ఎన్నికలు అయిపోగానే రేషన్ కార్డున్న నిరుపేదలకు సన్నబియ్యం అందిస్తామని చెప్పడం బాగుంది. ఇలాంటి పథకం మా లాంటి పేదలకు ఎంతో ఉపయోగకరం. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రవేశపెడుతున్నసీఎం కేసీఆర్ సార్‌ను ఎన్నటికీ మరువం. పేదవాళ్లను సైతం గుర్తుంచుకునేది కారు పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మాకు చేసింది ఏమీ లేదు. మళ్లీ కేసీఆర్ సారే రావాలి. ఆయనే మా దేవుడు.
– మల్లేశ్వరి, గృహిణి, బెండాలపాడు, చండ్రుగొండ మండలం