కారేపల్లి, ఆగస్టు 25 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన సింగరేణి గ్రామ పంచాయతీ మాజీ కార్మికుడు ఆదేర్ల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ సోమవారం 50 కేజీల బియ్యంతో పాటు రూ.5 వేల నగదును వెంకటయ్య కుమారుడు శ్రీనివాసుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, మాజీ ఉప సర్పంచ్ మునుగొండ నాగేశ్వర్రావు, మాజీ వార్డు సభ్యుడు కలియుల్లా ఖాన్, భిక్షపతి, ఫిరోజ్, అబ్దుల్ వాహిద్, ముస్తాక్, సింగరేణి గ్రామ పంచాయతీ పంప్ డ్రైవర్ దిండి లచ్చయ్య పాల్గొన్నారు.