కారేపల్లి, ఏప్రిల్ 10 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లికి చెందిన యువకుడు పిట్టల వెంకటేశ్ కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. బాధితుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో అయ్యప్ప భక్త బృందం పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ సభ్యులు విరాళాలు సేకరించారు. మొత్తంగా వచ్చిన రూ.11,700 నగదును మృతుడు తండ్రి బాలరాజుకు గురువారం అందించారు. ఇంటికి ఆసరాగా నిలుస్తున్న ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యుల వేదన తీరనిది అయింది. ఈ కార్యక్రమంలో పాలిక సారయ్య, కేతుమల్ల శ్రీను, పాలిక శ్రీనివాస్, సంగు సాయి, దమ్మాలపాటి కృష్ణ, దంతాల వెంకటేశ్, గోకినపల్లి నాగరాజు, వరప్రసాద్, పాలిక రమేశ్, కట్టా రమేశ్ పాల్గొన్నారు.