కారేపల్లి, అక్టోబర్ 07 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి గ్రామ పంచాయతీ పాత టీచర్ కాలనీలో పేద కుటుంబానికి చెందిన ముసుకుల కనకరాజు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. విషయం తెలిసిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ మంగళవారం కారేపల్లిలో గల ముసకుల కనకరాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు డొంకిని రవీందర్ గౌడ్, అబ్దుల్ వాహె, అజార్, సద్దాం, ముస్తాక్, ఆనందరావు, సతీష్, నాగేశ్వరావు పాల్గొన్నారు.