– నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్ నాయక్
కారేపల్లి, ఏప్రిల్ 08 : చెరువుల్లో పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకుని సద్వినియోగం చేసుకోవాలని నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్ నాయక్ సూచించారు. కారేపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పలు పెద్ద చెరువుల్లో పూడిక మట్టిని రైతులు తోలుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆయా చెరువుల సమీప ప్రాంత రైతులు ముందుగా నీటి పారుదల శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. కాగా ఎటువంటి అనుమతులు లేకుండా చెరువుల్లో మట్టి త్రవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.