Karepally : ‘వేతనాలు సరిపోక కుటుంబాలు గడవడం లేదు’
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చాలిచాలని వేతనాలకు పని చేస్తున్న తమ కుటుంబాలు గడవలేని దీన పరిస్థితిలో ఉన్నాయని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బొమ్మల అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
కారేపల్లి, సెప్టెంబర్ 18 : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చాలిచాలని వేతనాలకు పని చేస్తున్న తమ కుటుంబాలు గడవలేని దీన పరిస్థితిలో ఉన్నాయని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బొమ్మల అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో పని చేస్తున్న డైలీ వేజ్, కాంటినిజెంట్ వర్కర్స్ ను పర్మినెంట్ చేసి పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ కె జెడ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన నిరవధిక సమ్మె గురువారం ఏడవ రోజుకు చేరుకుంది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని శాంతినగర్ ఆశ్రమ పాఠశాల ముందు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత వారం రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి, కారేపల్లి మండలాలకు చెందిన ఆశ్రమ పాఠశాలల దినసరి కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

