కారేపల్లి, జూలై 12 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సీతారాంపురంలో యూత్ ఐకాన్స్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శరక్ మాక్స్విజన్ సూపర్ స్పెషలాటి ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 200 మంది వరకు కంటి పరీక్షలు చేయించుకున్నట్లు నిర్వాహకులు గుండమళ్ల కార్తీక్కుమార్ తెలిపారు. పరీక్షలు నిర్వహించిన వారికి ఆవసరమైన మందులను పంపిణి చేసినట్లు చెప్పారు. శస్త్ర చికిత్స అవరసమైన వారికి వైద్యులు రిఫర్ చేశారు.
ఈ సందర్భంగా యూత్ ఐకాన్స్ సభ్యులు మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకురావడం, స్వచ్ఛంద కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉండనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరం నిర్వహణపై గ్రామస్తులు యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మర్సకట్ల నాగేశ్వర్రావు, కొలికపొంగు సాయి, జోగ వెంకటేశ్, జోగ సాయి పాల్గొన్నారు.