ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 29 : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కుదిమల్ల గ్రామానికి చెందిన చేకూరు తిరుపతయ్య (75) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. తిరుపతయ్య బతికి ఉన్న సమయంలో నిత్యం తన వంతు పరోపకారం చేయిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన తండ్రి చనిపోయిన తర్వాత సైతం అదే ఒరవడిని కొనసాగిస్తూ తిరుపతయ్య సంతానం చేకూరి గోపాలరావు, నాగేశ్వరరావు, నరేంద్ర కుమార్, కాంపాటి పుల్లమ్మ తమ తండ్రి కండ్లను దానం చేశారు. దీంతో కొట్టా సరిత లయన్స్ క్లబ్ నల్లగొండ వారి ప్రోత్సాహంతో తిరుపతయ్య కార్నియల్స్ను సేకరించి ఖమ్మం నేత్ర నిధికి అందజేశారు. ఈ నిర్ణయం పట్ల గ్రామ ప్రజలు, బంధువులు పట్ల హర్షం వ్యక్తం చేశారు.