కారేపల్లి, ఏప్రిల్ 25 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్రోడ్లో సభకు తరలి వెళ్లడానికి జన సమీకరణకై శుక్రవారం ఆ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఈ సభకు ఉంటుందని తెలిపారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు భారీ సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు పార్టీ జిల్లా బాధ్యులు గ్రామాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ సభ కోసం కారేపల్లి మండలం నుండి ప్రత్యేక బస్సులు, కార్లలో జనాలను తరలించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ వైస్ చైర్మన్ ధరావత్ మంగీలాల్, మాజీ సర్పంచ్ బానోతు కుమార్, నాయకులు అడప పుల్లారావు, శివరాత్రి అచ్చయ్య, బానోతు రాందాస్, బత్తుల శ్రీనివాసరావు, సిద్ధంశెట్టి నాగయ్య, గుగులోతు రవి, తాత ఉపేందర్, సైజన్, సూరపరెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.