ఖమ్మం, జనవరి 9 : సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు ఇటీవల మృతిచెందారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఆయన పెద్దకర్మకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై నివాళి అర్పించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వేదికపైకి తుమ్మలను ఆహ్వానించిన సీఎం కేసీఆర్ హరినాథరావు కుమారులను పరిచయం చేశారు.