భద్రాచలం, జూన్ 18: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సీతారాములకు అర్చకులు నిత్య కల్యాణాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతం పలికి, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య హోమాలు, నిత్య బలిహరణం, నిత్య పూజలు జరిపారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న 18 జంటలకు స్వామివారి ప్రసాదాలు, శేష వస్ర్తాలను అందజేశారు.