మణుగూరు టౌన్/ భద్రాచలం/ సారపాక, సెప్టెంబర్ 2: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హాట్రిక్ విజయం లాంఛనమేనని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. రాష్ట్రమంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని అన్నారు. మణుగూరు ఆదర్శనగర్ మామిడితోట ఏరియాకు చెందిన 50 కుటుంబాల వారు కాంగ్రెస్ నుంచి వచ్చి శనివారం బీఆర్ఎస్లో చేరారు. అక్కడే జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను, అందించిన సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, వట్టం రాంబాబు, యూసఫ్ షరీఫ్, జావేద్పాషా తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కోసం బాధ్యతగా పనిచేయాలి..
పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. వైఎస్ఆర్ర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం నుంచి, కాంగ్రెస్ నుంచి సుమారు 500 కుటుంబాల వారు బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి వచ్చారు. భద్రాచలంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో వారందరికీ విప్ రేగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నాయకులు తిప్పన సిద్ధులు, కోటగిరి ప్రభోద్కుమార్, రత్నం రమాకాంత్, ఎండీ నవాబ్, చింతాడి చిట్టిబాబు, చాట్ల రవికుమార్, చుక్కా సుధాకర్ పాల్గొన్నారు.
మరికొందరు కాంగ్రెస్ నాయకులు..
మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్లో చేరారు. ఆ గ్రామానికి చెందిన బత్తిని శ్రీను, బత్తిని హరికుమార్, షేక బాబా, షేక్ మజీద్ తదితరులు మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు.