కారేపల్లి, జూలై 05 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కమిటీ సభ్యులతో శనివారం కారేపల్లి ఎంపీడీఓ సురేందర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు మంజూరైన వారు వెంటనే ముగ్గులు పోసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. కొత్తగా 390 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఇవి కేవలం గిరిజనులకు మాత్రమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పెంపును త్వరితగతిన పూర్తి చేసి జాబితాను అందజేయాలని పేర్కొన్నారు.