చింతకాని, నవంబర్ 30: మండలంలో ఉపాధి పథకం పక్కాగా అమలవుతున్నదని ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర కమిటీ పరిశీలకులు తెలిపారు. బుధవారం వారు మండల పరిధిలోని చింతకాని, పాతర్లపాడు, నేరడ, నాగులవంచలో చేపడుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పల్లె ప్రగతి పనులు గ్రామాల రూపురేఖలు మార్చాయని కితాబునిచ్చారు. పథకంలో భాగంగా ప్రతి ఊరికి ట్రాక్టర్, ట్యాంకర్లు, టాయిలెట్లు, ప్రకృతి వనం, నర్సరీ, క్రీడాప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పర్యటనలో కేంద్ర కమిటీ సభ్యులు కాంతమ్మ, వెంకటేశ్ జాదవ్, సర్పంచ్లు సుభద్ర, కాండ్ర పిచ్చయ్య, ఈశ్వరమ్మ, నాగమణి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏపీడీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.