మంత్రి పువ్వాడ అజయ్
టీఎన్జీవోస్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఖమ్మం, ఫిబ్రవరి 6 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి షేక్ అఫ్జల్‌హసన్, ఆర్వీఎస్ సాగర్ ఆధ్వర్యంలో రూపొందించిన యూనియన్ క్యాలెండర్‌ను కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్ నాయకులు మంత్రి, కలెక్టర్‌ను సత్కరించారు. మంత్రి అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో టీఆర్ఎస్ గవర్నమెంట్‌కు పేగుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అమోఘమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 73శాతం పీఆర్సీ ఇచ్చి గౌరవించారని తెలిపారు. ప్రజా సమస్యలను పరిషరించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌తో ఎంతో అవినాభావ సంబంధం ఉందని గుర్తుచేశారు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాను ఉద్యోగులు ప్రతి పారామీటర్‌లో ప్రథమ స్థానంలో ఉంచారని తెలిపారు. అనంతరం టీఎన్జీవోస్ మహిళ విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కొత్తగా నియమితులైన శాబాసు జ్యోతి, స్వప్నతోపాటు మిగతా విభాగాలకు ఎన్నికైన మహిళలకు చీరెలను అందజేసి సతరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సూడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న,
ఎంపీడీవోల సంఘం స్టేట్ అధ్యక్షుడు వెంకటపతిరాజ్, గెజిటెడ్ అసోసియేషన్ సంఘం నుంచి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సునిల్‌రెడ్డి, కార్యదర్శి దొడ్డ పుల్లయ్య, పంచాయతీరాజ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లెల రవీందర్, కార్యదర్శి రాజేశ్, డ్రైవర్స్ అసోసియేషన్ నుంచి హకీమ్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య, టీఎన్జీవోస్ అసోసియేట్ ప్రెసిడెంట్ చుంచు వీర నారాయణ, నందగిరి శ్రీను, భాగం పవన్, దాసరి రవికుమార్, తాడేపల్లి కిరణ్‌కుమార్, రాజేశ్, ఆర్ఎన్ పసాద్, కరణ్‌సింగ్, ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ రెంటాల సునీత, జాయింట్ సెక్రెటరీలు చిట్టిప్రోలు రమణ, కట్టగూరు సైదులు, చింతకాయల కృష్ణ, వాసన్ రవికుమార్, టి.వెంకటేశ్వర్లు, ఎల్లంపల్లి శాంతకుమారి, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు కూరపాటి శ్రీనివాస్, పబ్లిసిటీ సెక్రెటరీ కేవీవీ ప్రసాద్, కరణ్‌సింగ్, బుద్ధ రామకృష్ణ, కోళ్లపల్లి అచ్యుతారావు, జ్వాలా నరసింహారావు, ఆర్ఎన్ రాజు, కాల్వ విపుల్ జైన్, కె.పెద్ద పుల్లయ్య, ఖమ్మం టౌన్ యూనిట్ నుంచి ప్రెసిడెంట్ సామినేని రఘు, సెక్రెటరీ ఎండీ మజిద్, రఘునాథపాలెం యూనిట్ నుంచి బి.సాయి శిరన్మమయి, కె.వెంకటరత్నం, ఖమ్మం రూరల్ మండలం యూనిట్ నుంచి చీమల నాగేందర్‌బాబు, సోమిరెడ్డి వెంకటరెడ్డి, నేలకొండపల్లి యూనిట్ నుంచి షేక్ నాగుల్‌మీరా, కత్తుల రవీందర్, వైరా యూనిట్ నుంచి తుమ్మ రవీందర్, మిద్దె నాగ శివ స్వప్న, మధిర యూనిట్ నుంచి జాన్ సుదర్శన్, ఎడ్ల మల్లారెడ్డి, కల్లూరు యూనిట్ నుంచి మహమ్మద్ వజీరుద్దీన్, సవర్జన్ పాల్, సత్తుపల్లి యూనిట్ నుంచి విజయ్‌ప్రకాశ్, విజయ్భాసర్ పాల్గొన్నారు.