ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్
ఓ వ్యక్తి నుంచి రూ.26 వేల లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.
- రూ.26 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన అధికారులు
పాల్వంచ, అక్టోబర్ 23 : ఓ వ్యక్తి నుంచి రూ.26 వేల లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గ్రామానికి చెందిన గుగులోతు నాగరాజు కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు.
ఈ క్రమంలో పక్కనే ఉన్న తన మామ ఇంటి నుంచి కరెంట్ తీసుకొని కొత్త ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నాడు. దీనిని గమనించిన లైన్ ఇన్స్పెక్టర్ జినుగు నాగరాజు.. విద్యుత్ వినియోగిస్తున్న కొత్త ఇంటి యజమాని గుగులోతు నాగరాజుపై కేసు నమోదు చేసి, జరిమానా విధిస్తానని భయపెట్టాడు. కేసు లేకుండా చేయాలంటే రూ.65 వేలు ఇవ్వాలని లైన్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనని, రూ.26 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.
తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించిన గుగులోతు నాగరాజు.. వారు చెప్పిన విధంగా పథకం ప్రకారం లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు లంచం డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపించాడు. పాల్వంచలోని అంబేద్కర్ కూడలిలో బాధితుడు నాగరాజు నుంచి లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రూ.26 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ రమేశ్ వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ నిబంధనల ప్రకారం అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రమేశ్ తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

