కారేపల్లి, మే 05 : కారేపల్లి మండల కేంద్రంలోని సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా దుగ్గినేని శ్రీనివాసరావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు జిల్లా సొసైటీ పర్సనల్ ఇన్చార్జి మేరీ కుమారి చేతుల మీదుగా సొసైటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు, విత్తనాలను అందజేస్తూ సొసైటీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ బొల్లు హనుమంతరావు, డైరెక్టర్లు అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, సొసైటీ సిబ్బంది డి.కృష్ణ, సాంబశివరావు, పాషా పాల్గొన్నారు.