కారేపల్లి, నవంబర్ 21 : కారేపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఖమ్మం జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలోని కారేపల్లి, మాధారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన కేంద్రాల్లోని ధాన్యం రాశుల తేమ శాతాన్ని పరిశీలించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను, పరికరాలను తనిఖీ చేశారు. నాణ్యమైన ధాన్యాన్ని కాంటా పెట్టించి వెంటనే కేంద్రాలకు కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. మిల్లులకు పంపిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ధాన్యం పైకం వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. డీఎస్ఓ వెంట ఏఓ బి.అశోక్‌కుమార్, సివిల్ సప్లయ్ ఆర్ఐ వీరయ్య ఉన్నారు.