మామిళ్లగూడెం, జనవరి 3: ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. మార్చి 5 నుంచి 25 వరకు జిల్లాలో జరిగే ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని తెలిపారు. సోమవారం మొదలైన ప్రాక్టికల్స్ ఈ నెల 22 వరకు జరుగుతాయని తెలిపారు. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే 36,660 మంది విద్యార్థులకు 72 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. డీఐఈవో రవిబాబు, ఇతర శాఖల జిల్లా అధికారులు కళావతిబాయి, నారాయణ, దినేశ్‌కుమార్ విజయలక్ష్మి, వెంకటరామయ్య, భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.