కారేపల్లి, జూలై 14 : ఖమ్మం జిల్లా కారేపల్లిలో గల రైల్వే స్టేషన్ను సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ (డిఆర్ఎం) గోపాల్ కృష్ణన్ మంగళవారం సందర్శించారు. రాబోయే గోదావరి పుష్కరాల పనుల పర్యవేక్షణలో భాగంగా భద్రాచలం రోడ్ వెళ్లిన డిఆర్ఎం తిరుగు ప్రయాణంలో కారేపల్లి రైల్వే స్టేషన్లో కాసేపు ఆగారు. డోర్నకల్- భద్రాచలం రోడ్డు రైల్వే మార్గంలో నూతనంగా నిర్మించనున్న డంబ్లింగ్ (రెండవ లైన్) రైల్వే పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్కు చేరుకున్న డీఆర్ఎంను స్థానికులు కలిసి కొవిడ్ కాలం నుండి కారేపల్లి రైల్వే స్టేషన్లో ఆగని ప్యాసింజర్ రైళ్లకు నిలుపుదల ఇవ్వాలని, తాత్కాలికంగా రద్దైన ట్రైన్లను పునరుద్ధరించాలని కోరారు. దీంతో డీఆర్ఎం సానుకూలంగా స్పందించారు.