ఖమ్మం: జిల్లాలో దూరదర్శన్ ప్రసారాలను డిసెంబర్ 31వ తేదీ వరకు నిలిపి వేస్తున్నట్లు ప్రసార భారతి బోర్డు అడిషనల్ డైరెక్టర్ జనరల్ కే.తానువలింగం గురువారం ఓ ప్రటకనలో తెలిపారు. ప్రసార భారతి బోర్డు ఆదేశాల మేరకు ఖమ్మంలో ఉన్న దూరదర్శన్ రిలే కేంద్రం నుంచి 500 వాట్ లోపవర్ టెరస్ట్రీయల్ ట్రాన్స్‌మీటర్ చాలన్ నెంబర్ 1, ఫ్రీక్వెన్వీ 182.25 మోగా హెడ్జ్ ద్వారా ప్రసారమవుతున్న దూరదర్శన్ జాతీయ, ప్రాంతీయ ప్రసారాలు నెల రోజుల పాటు నిలిపి వేసినట్లు పేర్కొన్నారు.